'ఉపాధ్యాయుల సమస్యలపై STU పోరాటం'
W.G: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం STU నిరంతరాయంగా పోరాడుతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకలపల్లి సాయి శ్రీనివాస్ తెలిపారు. ఆచంట మండలంలోని ఉన్నత పాఠశాలలను ఇవాళ ఆయన సందర్శించి, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ పెన్మత్స సాయివర్మ, పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.