హర్మూజ్‌ను దాటిన గ్రీన్ సాన్వి.. స్పందించిన ఇరాన్
హర్మూజ్ జలసంధి గుండా భారత LPG ట్యాంకర్ 'గ్రీన్ సాన్వి' సురక్షితంగా ప్రయాణించడంపై ఇరాన్ స్పందించింది. ముంబైలోని ఇరాన్ రాయబారి మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ దేశాల మధ్య ఉన్న దృఢమైన సంబంధాలను కొనియాడారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, వ్యూహాత్మక జలమార్గాల్లో సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆకాంక్షించారు.