విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ధర్నా

HNK: కె.ఎల్.రెడ్డిలో కాలనీలో ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ముందు శనివారం ఇసుక లారీ అసోసియేషన్‌కు చెందిన అధ్యక్షుడు శ్రీనివాస్ నాయుడు నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతించిన బరువును మించిపోయిన ఇసుక లారీలను అధికారులు నిలిపివేసి తనిఖీల పేరుతో ఇబ్బందులు గురిచేస్తున్నారని దీనిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు.