హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
SDPT: జిల్లా ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను స్నేహం, సౌహార్దం, ఆనందానికి ప్రతీకగా అభివర్ణించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఐక్యత, శాంతి, సుఖసమృద్ధులు నెలకొనాలని ఆకాంక్షించారు. అందరం కలిసికట్టుగా సామరస్యంతో ముందుకు సాగుదామని, ద్వేషాలకు తావులేకుండా ప్రేమ, పరస్పర గౌరవంతో సమాజాన్ని బలపరచుకుందామన్నారు.