'స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి'
KMM: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన రూ. 161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభవన్లో జరిగిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది పేద విద్యార్థులకు, కళాశాలలకు ఊరట లభించనుంది.