ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించండి: ఎమ్మెల్యే
BDK: అశ్వరావుపేట మండలం నారంవారిగూడెంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఇటీవల భూ వివాదంలో దాడికి గురై చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్న వెంకటేశ్వరరావును పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మాట్లాడుతూ.. ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించాలని ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.