మహిళా సమైక్య సంఘాల ఆడిట్ కార్యక్రమం ప్రారంభం

KMR: రాజంపేట మండలంలోని అన్ని గ్రామాల మహిళా సమైక్య సంఘాల ఆడిట్ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక ఐకెపి కార్యాలయంలో చార్టర్ అకౌంటెంట్ ఇప్పకాయల రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సభ్యులకు ఇచ్చిన రుణాలు, రికవరీలు ఇతర అంశాలను ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం సాయిలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు, సీసీలు వివోఏలు పాల్గొన్నారు.