VIDEO: అద్దంకిలో ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు
BPT: అద్దంకి బంగ్లా రోడ్డులోని యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జే. బాబూరావు పాల్గొన్నారు.