బీసీలకు లక్ష కోట్ల హామీ ఏమైంది?: హరీశ్‌రావు

బీసీలకు లక్ష కోట్ల హామీ ఏమైంది?: హరీశ్‌రావు

TG: బీసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న హామీని సీఎం రేవంత్‌ రెడ్డి విస్మరించారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. రేవంత్‌ బీసీలను కేవలం ఓటు బ్యాంకులానే చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే బడ్జెట్‌లోనైనా BC సంక్షేమం భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.