ఈనెల 27 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు
AKP: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు, రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 చివరి తేదీగా నిర్ణయించినట్లు ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గడువు తేదీ పొడిగింపుకు అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఫీజు చెల్లింపుకు ముందుకు రావాలని కోరారు.