VIDEO: టిడ్కో కాలనీలో మురుగునీటి సమస్య
కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో సెప్టిక్ ట్యాంక్‌ల సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. మరమ్మతులు చేసినప్పటికీ ప్రధాన సెప్టిక్ ట్యాంక్‌కు డ్రైనేజీ మెయిన్ లైన్ పూర్తిగా బ్లాక్ అయి ఉండడంతో మురుగునీరు సాఫీగా వెళ్లడం లేదన్నారు. దోమలు వ్యాపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు.