KCRకు వెన్నుపోటు పొడవాలనుకున్నారు: కౌశిక్ రెడ్డి
TG: ఎంపీ ఈటల రాజేందర్‌ది మోసపూరిత చరిత్ర అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను వెన్నుపోటు పొడవాలనుకున్నారని విమర్శించారు. హుజురాబాద్ ప్రజలను మోసం చేసి గజ్వేల్ వెళ్లారని అన్నారు. అక్కడి నుంచి మల్కాజ్‌గిరి వెళ్లారని తెలిపారు. మళ్లీ కమలాపూర్ గడ్డకు వస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వారిని ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు.