పెద్ద శ్రీరాంపురంలో విద్యుత్ మరమ్మతులు

SKLM: కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం పంచాయతీలో విద్యుత్ శాఖ సిబ్బంది సోమవారం మరమ్మతు పనులు చేపట్టారు. గ్రామంలో మెయిన్‌లైన్ కింద ఏపుగా పెరిగిన మొక్కలు, వృక్షాలు, కొమ్మలను తొలగించారు. వర్షాకాలంలో ఇవి విద్యుత్ తీగలకు తగిలి షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్త చర్యగా కొమ్మలు తొలగించామని సిబ్బంది తెలిపారు.