VIDEO: ఈనెల 16న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభ
SRD: సంగారెడ్డి పట్టణంలో ఈనెల 16వ తేదీన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ కోరారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. మహాసభలకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.