విదేశాలకు వద్దు.. దేశీయ పర్యాటకమే ముద్దు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులు తమ విదేశీ పర్యటనలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనల కన్నా దేశంలోని పర్యాటక ప్రాంతాల వైపు భారతీయులు మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే సంస్థ తెలిపింది. రిషికేశ్, సిమ్లా, మనాలీ, షిల్లాంగ్ వంటి శీతల ప్రదేశాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పింది. అలాగే పలు ప్రముఖ దేవాలయాలకు తాకిడి పెరిగినట్లు పేర్కొంది.