పదో తరగతి పరీక్షలకు సిద్ధం

పదో తరగతి పరీక్షలకు సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం 60 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 13,271 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, విద్యార్థులు కూడా అధిక మార్కుల కోసం పట్టుదలతో చదువులో నిమగ్నమై ఉన్నారు.