మహిళా దినోత్సవ వేడుకలకు పటిష్ట భద్రత
GNTR: రాజధాని రాయపూడి ఆర్డీ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ రూట్ మ్యాప్, పార్కింగ్ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.