గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

WGL: గూడూరు మండలంలోని ఏపూరు గ్రామంలో గుడుంబా స్థావరాలపై గురువారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 250 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసి, 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గూడూరు ఎస్సై నగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిషేధిత గుడుంబాను తయారు చేసిన, విక్రయించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత దూరంగా ఉండాలని సూచించారు.