IPL మ్యాచ్.. వాటికి నో ఎంట్రీ
HYD: ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. SRH VS CSK మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే గేట్స్ ఓపెన్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. అయితే, స్టేడియానికి వచ్చే వారు ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.