యుద్ధం ప్రభావం.. డ్రై ఫ్రూట్స్ వ్యాపారుల టెన్షన్

యుద్ధం ప్రభావం.. డ్రై ఫ్రూట్స్ వ్యాపారుల టెన్షన్

HYD: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా నగరంలోని డ్రై ఫ్రూట్స్ వ్యాపారుల్లో టెన్షన్ నెలకొంది. అసలే రంజాన్ మాసం.. ఉపవాస దీక్ష సందర్భంగా డ్రై ఫ్రూట్స్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఖర్జూరాలు ఎక్కువ మంది వినియోగిస్తారు. వీటితోపాటు బాదం, పిస్తా, అంజీర్, కుంకుమ పువ్వు తదితరాలు ఇరాన్ నుంచే రావాల్సి ఉంది.