'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి'
CTR: పుంగనూరులోని ప్రైవేటు బస్టాండ్‌లో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూషారెడ్డి అధ్యక్షతన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.