మట్టి గోడల మధ్యే బతుకు.. ఇల్లు మంజూరు చేయరూ..

NLG: శాలిగౌరారం మండలం వల్లాలలో నిరుపేద కుటుంబానికి చెందిన గుండ్లపెల్లి యాదయ్య ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూస్తున్నాడు. వర్షాకాలంలో మట్టి గోడల ఇంట్లో పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ ఆశలు నెరవేర్చాలని, అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.