'మోగ్లీ' ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ 'మోగ్లీ'. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీని ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. సాక్షి మడోల్కర్ కథానాయికగా నటించింది.