శాంపిళ్లను సేకరించిన జిల్లా అధికారులు

శాంపిళ్లను సేకరించిన జిల్లా అధికారులు

KMR: బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (ఏఎస్ఓ) స్వామి తనిఖీ చేశారు. అనుమానం ఉన్న 32 బస్తాల బియ్యం నుంచి శాంపిళ్లను సేకరించి డీఎం కార్యాలయానికి పంపనున్నట్లు తెలిపారు. రిజల్ట్ వచ్చే వరకు మిల్లును మూసి ఉంచాలని అధికారులు ఆదేశించారు.