'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి'
AKP: రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది. బుచ్చయ్యపేట మండలం రాజాంలో ఉపాధి హామీ కూలీలతో ప్రచారం నిర్వహించారు. సమ్మెలో భారీగా పాల్గొనాలని అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి కోన మోహనరావు కోరారు.