రహస్య కెమెరాలు.. సజ్జనార్ హెచ్చరిక
TG: పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రీకరించే వారిపై ఉక్కుపాదం మోపుతామని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. అందుకోసం ఇవాళ 'షీ నేత్ర టీమ్స్'ను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. బట్టల దుకాణాలు, హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్ ప్రాంతాల్లో ఆడవారి భద్రత ఆయా సంస్థల యాజమాన్యాలదే అని తేల్చిచెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.