ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా చేశారు: మంత్రి సవిత

సత్యసాయి: జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీ చేశారని మంత్రి సవిత అన్నారు. పెనుకొండలో మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీలో గొప్పలు చెప్పారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యశ్రీని మరింత అభివృద్ధి చేసి ఎన్నో లక్షల మంది ఆరోగ్యం కాపాడుతున్నారని తెలిపారు. అభివృద్ధి పనుల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు.