వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి
SKLM: టెక్కలి మండల కేంద్రంలోని స్థానిక వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఇవాళ ఆలయానికి వెళ్లిన ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.