నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ

నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ

E.G: సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. నీటి పొదుపు, వర్షపు నీటి నిల్వపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నీటి వృథాను అరికట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని అధ్యాపకులు సుధామయి, సుబ్బారావు, వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ సామాజిక బాధ్యతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.