మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

VSP: బురుజుపేటలో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వీటి నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.