ప్రభుత్వ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నిరసన
CTR: పుంగనూరులో బైపాస్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే గురువారం పట్టణంలోని రహదారులు మరియు భవనముల శాఖ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డులోని Y జంక్షన్లు, సర్కిల్స్‌లో ప్రమాదాలు అధికమయ్యాయన్నారు.