'లోన్ యాప్స్ బారిన పడొద్దు'
KDP: చాలా మంది సెల్ ఫోన్‌లో వచ్చే లోన్‌యాప్‌లను నమ్మి మోసపోతుంటారని వన్ టౌన్ సీఐ చిన్నపెద్దయ్య అన్నారు. లోన్‌యాప్‌ల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో సీఐ ప్రజలకు లోన్‌యాప్‌లపై అవగాహన కల్పించారు. బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవడం ఉత్తమం అన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.