'రోడ్డు భద్రత నియమాలను వాహన దారులు పాటించాలి'
KNR: రోడ్డు భద్రత నియమాలను వాహనదారులు పాటించాలని, కరీంనగర్ సీపీ గౌస్ ఆలాం అన్నారు. గంగాధర మండలంలో 'అరైవ్-అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ ధరించని వారే చనిపోతున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, ప్రమాదాలను నివారించాలని ఆయన పిలుపునిచ్చారు.