జూబ్లిహిల్స్‌లో ఇందిరా మహిళా శక్తి వారోత్సవాలు

HYD: వెంగళరావునగర్ పరిధిలో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తున్నామని పొన్నం వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు.