ఇంటి పన్నులు సకాలంలో కట్టాలి: ఇంఛార్జ్ కార్యదర్శి కృష్ణ

ఇంటి పన్నులు సకాలంలో కట్టాలి: ఇంఛార్జ్ కార్యదర్శి కృష్ణ

VZM: కొత్తవలస పంచాయతీ పరిధిలో ఉన్న గృహ యాజమానులు, వ్యాపారవేత్తలు పంచాయతీకి బకాయిలు ఉన్న ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని ఇంఛార్జ్ కార్యదర్శి వి. కృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటి పన్నులు తమ సమీపంలో ఉన్న మీ సేవ, లేదా సచివాలయంలో కట్టాలని సూచించారు. అలాగే స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో కట్టి, పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.