సీఎంకు స్వాగతం పలికిన ఎస్పీ
నెల్లూరు జిల్లాలోని వింజమూరులో పర్యటించేందుకు సీఎం చంద్రబాబు బుధవారం వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితిపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.