హాస్టల్ మరమ్మతులు పూర్తి చేయాలి: కలెక్టర్
NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని మంగళవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పరిశీలించారు. హాస్టల్లోని మరుగుదొడ్లు, గదులు శిథిలావస్థకు చేరాయని విద్యార్థులు కలెక్టర్‌కు చెప్పారు. జూన్ 12 పాఠశాల పునః ప్రారంభం నాటికి మరమ్మతులు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.