సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
KNR: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో 6వ, 7వ వార్డులో సోమవారం సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో రూ.15 లక్షల నిధులు మంజూరు చేసినట్లు సర్పంచ్ దూలం కళ్యాణ్ తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని అన్నారు.