ఎరువుల షాపును తనిఖీ చేసిన ఏవో

ఎరువుల షాపును తనిఖీ చేసిన ఏవో

మన్యం: పాచిపెంటలో ఎరువుల షాపును మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు తనిఖీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు పెట్టవద్దని, రైతులు ఏ ఎరువులు కావాలంటే ఆ ఎరువులు మాత్రమే అమ్మాలని, రైతులు వద్దు అనుకున్నా ఎరువులు బలవంతంగా ఇవ్వదని, రైతులు నుండి పిర్యాదులు వస్తే చర్యలు తప్పవని షాపు యజమానికి హెచ్చరించారు.