7,200mAh బ్యాటరీతో ఐక్యూ Z11x 5G

7,200mAh బ్యాటరీతో ఐక్యూ Z11x 5G

చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ దేశీయ మార్కెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐక్యూ Z11కు కొనసాగింపుగా iQOO Z11x 5G పేరిట విడుదల చేసింది. ఐక్యూ Z11x 5G 3 వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్‌ 6GB+128GB ధర రూ.18,999, 8GB+128GB వేరియంట్‌ రూ.20,999, 8GB+256GB వేరియంట్‌ రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది.