'తాటి చెట్లను తొలగించడం సరికాదు'
SDPT: సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లను తొలగించడం సరికాదని నంగునూరు మండల బీఆర్ఎస్ నాయకులు లింగం గౌడ్, రమేష్ గౌడ్ అన్నారు. నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ఈ నెల 22న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లను కొట్టి గీతా కార్మికుల పొట్ట కొట్టడం సబబు కాదన్నారు.