'పర్ధాన్ తెగకు పార్టీలు గుర్తింపునివ్వాలి'
ADB: పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీ పర్ధాన్ తెగకు అన్నీ పార్టీలు గుర్తింపునిచ్చి బి ఫారాలను అందజేయాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నేతలు కోరారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో ఆదివాసీ పర్ధాన్ సమాజ్‌కు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు.