కాటమయ్య కొండ అభివృద్ధికి మంత్రి సత్యకుమార్ చొరవ

కాటమయ్య కొండ అభివృద్ధికి మంత్రి సత్యకుమార్ చొరవ

సత్యసాయి: బత్తలపల్లి మండలం సంజీవపురం పంచాయతీ పరిధిలోని ముష్టూరు కాటమయ్య స్వామి కొండ చుట్టూ 3.7 కిలోమీటర్ల పెరిఫెరల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గిరి ప్రదక్షిణ చేయడానికి, రాకపోకలు సులభతరం చేసేందుకు ఈ రహదారి అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు.