ప్రత్యేక ఐటీ బృందం సేవల కొనసాగింపు
AP: గిరిజన సంక్షేమశాఖకు సంబంధించిన సేవలను పౌరులకు వేగవంతంగా అందించేందుకు ప్రత్యేక ఐటీ బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందాలను రెండేళ్లపాటు కొనసాగించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన ప్రగతి పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ కోసం ఈ బృందాలు పనిచేయనున్నాయి. ఇందులో 20 మంది సభ్యులుగా ఉన్నారు.