రేపు సురుటుపల్లిలో నందీశ్వరునికి ప్రదోష పూజలు
TPT: నాగలాపురం (M) సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు జరగనున్నట్లు ఈవో లత తెలిపారు. ప్రదోష అభిషేక పూజలకు కావలసిన పూజా సామాగ్రిని భక్తులు కానుకలుగా సమర్పించవచ్చన్నారు. ప్రదోష అభిషేక పూజలో పాల్గొని భక్తులు రూ.500 చెల్లించి టికెట్ పొందాలన్నారు.