రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయి
ATP: తాడిపత్రి విద్యార్థినులు క్రీడా పోటీలలో సత్తా చాటుతున్నారు. పట్టణానికి చెందిన రుక్సానా అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ క్రీడా మైదానంలో జరిగిన కబడ్డీ SGF అండర్-14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో సెలెక్టర్లు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు ఎంపిక చేసినట్లు పీఈటీ చంద్ర తెలిపారు.