ఎవరికీ భయపడేది లేదు: మాజీ ఎమ్మెల్యే

ELR: పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల తన తోటలో జరిగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ.. తోటలపై దాడులు చేసే విష సంస్కృతి రాష్ట్రంలో మొదలైందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎవరికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.