యోగా పోటీల్లో సత్తాచాటిన విద్యార్థినీలు

PPM: వీరఘట్టం మండలం తలవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు యోగా పోటీల్లో సత్తాచాటారు. పార్వతీపురం కలెక్టరేట్ యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు సంజన, పవిత్ర, హేమలత ఉత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు యోగా గురువు జనార్ధనరావు తెలిపారు.