ఆదిలాబాద్ ఎంపీకి మంత్రి పదవి వరించేనా..?

ఆదిలాబాద్ ఎంపీకి మంత్రి పదవి వరించేనా..?

ADB: కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాష్ట్రం నుంచి మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8ఎంపీ స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరిగింది. కాగా, దేశంలో మొత్తం 47ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో జిల్లా బీజేపీ ఎంపీ గోడం నగేష్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అని చర్చ మొదలైంది.