దేశంలో రైతులపై పెరుగుతున్న అప్పుల భారం
దేశవ్యాప్తంగా రైతులపై రుణాల భారం పెరిగిపోతుందని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతుల మొత్తం అప్పులు రూ.31,34,807 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. వీటిలో క్రాప్ లోన్స్ రూ.20.17 లక్షల కోట్లు కాగా, టర్మ్ లోన్స్ రూ.11.17 లక్షల కోట్లు అని వివరించింది. అత్యధికంగా రైతుల అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. రూ. 3,75,254 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది.